రోడ్డు ప్రమాదాన్ని జయించి యూపీఎస్సీలో సత్తా చాటిన ఆతిరా సుగతన్

రిపోర్టర్: మహేష్ స్థలం: India

భయంకరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జ్ఞాపకశక్తి కోల్పోయి, వీల్‌చైర్‌కే పరిమితమైన డాక్టర్ ఆతిరా సుగతన్ అసాధారణ పట్టుదలతో విజయం సాధించారు. కష్టాలను ఎదుర్కొంటూనే చదువు పూర్తి చేసిన ఆమె, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 483వ ర్యాంకు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.