గర్భిణులు పిల్లలు పోషకాహారం తీసుకోవాలని కార్పొరేటర్ అబ్బగోని కవిత పిలుపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: নల్లగొండ
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని నల్లగొండ 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవితా రమేష్ పిలుపునిచ్చారు. జాతీయ పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా గొల్లగూడ సెక్టార్ పరిధిలోని బొయవాడ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.