తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో దంచికొట్టిన అమృతా లక్ష్మి
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి నగర కార్పొరేటర్ ఎన్నికలలో ఇరవై మూడో డివిజన్ నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి మన్నూరు అమృతా లక్ష్మి పదకొండు వందల యాభై ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆమె గెలుపుతో కూటమి శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ అఖండ విజయంతో డివిజన్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.