విజయనగరం మహిళా హాస్టళ్లలో వేధిస్తున్న సిబ్బంది తీవ్ర కొరత

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని కాలేజ్ ఎట్ హోమ్, వర్కింగ్ విమెన్స్ హాస్టళ్లలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారింది. కాపలాదారులు, వంట మనుషులు లేక విద్యార్థినులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పరిసరాలను తామే శుభ్రం చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఐసీడీఎస్ పీడీ కేవీ బాలామణి వెల్లడించారు. త్వరలోనే వేరొకరిని నియమించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.