విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా జరిమానాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విజయవాడలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల మొదటి తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్య నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నూట తొంబై తొమ్మిది మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, నూట తొంబై ఐదు మందికి ఇరవై లక్షల ముప్పై ఐదు వేల రూపాయల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.