ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తోందా: ఇది మీలోని అనారోగ్య సమస్యల సంకేతం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: బెంగళూరు
నిద్రలేవగానే తల బరువుగా మారడం లేదా తలనొప్పి రావడం వెనుక పలు శారీరక సమస్యలు ఉన్నాయని డాక్టర్ మొహమ్మద్ ముజాహిద్ ఉస్మాన్ వెల్లడించారు. స్లీప్ అప్నియా, దవడ కొరకడం, తప్పుడు నిద్ర భంగిమలు వంటి కారణాల వల్ల ఉదయాన్నే ఈ సమస్య తలెత్తుతుందని ఆయన తెలిపారు. టెన్షన్ హెడేక్, మైగ్రేన్, సైనస్ నొప్పుల మధ్య తేడాలను గుర్తించి తగిన వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.