పొదలకూరు జెడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా సురేష్ బాబు నామినేషన్ దాఖలు

రిపోర్టర్: sujith reddy స్థలం: పొదలకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండల జెడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున సురేష్ బాబు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మండలంలో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి తమ మద్దతు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని జనసేన అభ్యర్థి సురేష్ బాబు స్పష్టం చేశారు.