ట్రస్ట్ గేట్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ విద్యార్థులు
రిపోర్టర్: శివ
స్థలం: గాంధీనగర్
ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన ఇద్దరు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మిలోని థక్కర్, మిల్వా గోస్వామి కృత్రిమ మేధ ఆధారిత ట్రస్ట్ గేట్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పవర్ గ్రిడ్లపై సైబర్ దాడిని గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. చైనాలో జరిగిన ఇంటెల్ కప్ అంతర్జాతీయ పోటీల్లో ఈ ప్రాజెక్ట్ రెండో బహుమతిని గెలుచుకుందని పేర్కొంది.