రెండ్లగూడలో ఇరవై ఎనిమిది ఎకరాల చెరువును మింగేసిన కబ్జాకోరులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రెండ్లగూడలోని చెరువు అక్రమణలతో ఇరవై ఎనిమిది ఎకరాల నుంచి రెండున్నర ఎకరాలకు తగ్గిపోయిందని సామాజిక వేత్త సముద్రాల శంకర్ ఆరోపించారు. ఐదు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కబ్జాలపై తక్షణమే స్పందించి సర్వే నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు.