బ్యాంకు నిర్లక్ష్యం: వృద్ధుడికి పరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కమిషన్ ఆదేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: Kerala

కేరళలో దివంగత భార్య సేవింగ్స్ ఖాతా డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జిల్లా కన్స్యూమర్ కమిషన్ షాక్ ఇచ్చింది. సేవల్లో లోపంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్, వృద్ధుడికి రూ. 10 వేల పరిహారంతో పాటు రూ. 5 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.