గోల్డెన్ స్టేట్ వారియర్స్‌తోనే కరియర్ ముగిస్తానన్న స్టార్ బాస్కెట్‌బాల్ ఆటగాడు కర్రీ
రిపోర్టర్: రాము
స్థలం: World
గోల్డెన్ స్టేట్ వారియర్స్ జట్టుతో తనకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూ కెరీర్ చివరి వరకు ఇక్కడే కొనసాగుతానని స్టార్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు స్టీఫెన్ కర్రీ స్పష్టం చేశారు. ఫ్రాంచైజీ అందించిన కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పొడిగింపు ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.