రోడ్డు పనుల పేరుతో సిద్దాపూర్ చెరువును మింగేస్తున్నారంటూ గ్రామస్తుల ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్లో రోడ్డు పనుల పేరుతో చెరువును అక్రమంగా తవ్వుతున్నారని గ్రామస్తుడు ఎండీ. నిజాముద్దీన్ మండిపడ్డారు. రూ.9 కోట్ల ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలు, హిటాచీలతో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు అమ్ముకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మైసమ్మ కట్టను ధ్వంసం చేయడం వల్ల చెరువులో నీరు నిలవట్లేదని, భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.