ప్రధాని మోదీని అనుకరిస్తూ వివాదం రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఇండోర్

ఇండోర్‌లో జరిగిన ఛత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో కమెడియన్ పుల్కిత్ మని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరించడంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వేదికపై ఉండగానే ప్రధానిని, ఆయన తల్లిని అవమానించేలా ప్రదర్శన చేయడంపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కమెడియన్లు, జోకర్ల పార్టీగా మారిందని కిరణ్ రిజిజు విమర్శించగా, రాహుల్ గాంధీ నైతిక దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.