అమితాబ్ హనుమాన్ చాలీసాతో కూతురి ఉదయం: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ వెల్లడి

రిపోర్టర్: అశోక్ స్థలం: Mumbai

కూతురు రాహా పుట్టిన తర్వాత ప్రతిరోజూ ఉదయం అమితాబ్ బచ్చన్ గొంతులోని హనుమాన్ చాలీసాతోనే తమ దినచర్య మొదలవుతుందని నటుడు రణబీర్ కపూర్ పేర్కొన్నారు. ప్రముఖ క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కూతురి పట్ల తన భక్తి భావాన్ని, అమితాబ్ గొంతుపై ఉన్న మమకారాన్ని ఆయన పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి, రవి దూబే కూడా పాల్గొన్నారు.