పలాసలో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక కుంకుమ పూజలు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాపు వీధిలో వినాయక పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ముప్పై ఐదు రకాల నైవేద్య ప్రసాదాలను వార్డు ప్రజలందరూ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.