వేమన్పల్లి కాంగ్రెస్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వేమన్‌పల్లి

వేమన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు మండల స్థాయి కీలక బాధ్యతలను పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

మండల ఉపాధ్యక్షులుగా నేండుగూరి మధుసూదన్, ఇగురం జగన్, ప్రధాన కార్యదర్శులుగా చెన్నూరి పురుషోత్తం, కుర్రు అంజన్న, కోలా సరోజ మహేష్, అన్నారపు శంకర్, కోశాధికారిగా దందేరా మహేష్, సోషల్ మీడియా కన్వీనర్గా కామెర గణేష్ ఎన్నికయ్యారు.