క్యాన్సర్ చికిత్స తర్వాత కెమెరా ముందుకు నటి దీపికా కకర్
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
కాలేయ క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూనే భర్త షోయబ్ ఇబ్రహీంతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించినట్లు ప్రముఖ నటి దీపికా కకర్ వెల్లడించారు. చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు రావడంతో మొదట తాను ఎంతో భయపడ్డానని, అయితే భర్త తనకిచ్చిన అండతోనే ఈ విజయం సాధించానని ఆమె ఆవేదన, ఆనందాలను పంచుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటూ ఆమె చేసిన ఈ పోరాటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.