పౌష్టికాహార వారోత్సవాలు: అనికేపల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లులకు అవగాహన

రిపోర్టర్: sankar p స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని అనికేపల్లి అంగన్వాడి పాఠశాలలో పౌష్టికాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి సూపర్వైజర్ బి. పద్మజ పాల్గొని బాలింతలు మరియు గర్భిణులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు విజయలక్ష్మి, ఎస్. విజయలక్ష్మి, సునీతతో పాటు పలువురు సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.