సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం: బ్యాటరీ పరిశ్రమ దగ్ధం
రిపోర్టర్: మహేష్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ప్యూర్ ఈవీ బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఒక ప్లాంట్ లోని మౌలిక సదుపాయాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.