మరకతమణి 2 షూటింగ్ పూర్తి: త్వరలో థియేటర్లలోకి ఆది పినిశెట్టి సినిమా

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హీరో ఆది పినిశెట్టి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న మరకతమణి రెండు షూటింగ్ పనులు పూర్తిగా ముగిశాయని మేకర్స్ వెల్లడించారు. దర్శకుడు ఏఆర్కే శరవణ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. త్వరలోనే ఆడియో, ట్రైలర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.