పత్తి రైతులకు తీవ్ర అన్యాయం: క్వింటాల్ కు రూ.9500 చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నర్వ

పత్తి రైతులకు మార్కెట్ లో ఆశించిన ధర దక్కడం లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతర్చేడు గ్రామ పరిధిలోని ఉత్కర్ కాటన్ మిల్లులో క్వింటాల్ పత్తిని ఎనిమిది వేల రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ ధర ప్రకారం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని, తూకంలో జరుగుతున్న మోసాలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.