రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా శరన్నవరాత్రుల పర్వదిన శుభాకాంక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఆదివారం నుంచి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల వేళ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రత్యేక సందేశం పంచుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ కృపాకటాక్షాలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించినట్లు తెలిపారు.