చంద్రుడిపై నీటి కొరత: ఎలన్ మస్క్ భారీ నగర కలలకు ఎదురుదెబ్బ!

రిపోర్టర్: సురేష్ స్థలం: World

చంద్రుడిపై మిలియన్ల మందితో స్వయం సమృద్ధి నగరం నిర్మించాలనే ఎలన్ మస్క్ కలలకు నీటి కొరత రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాబిల్లిపై లభించే నీరు ఒక మిలియన్ జనాభా అవసరాలకు శతాబ్ద కాలం కూడా సరిపోదని తాజా శాస్త్రీయ అధ్యయనం హెచ్చరించింది. నీటి కొరత కారణంగా చంద్రుడిపై భారీ కాలనీల ఏర్పాటుకు గట్టి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.