కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో ప్రత్యేక ఆకర్షణగా ధనగణపతి

రిపోర్టర్: సురేష్ స్థలం: మంగళగిరి

గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్‌బజారులో వర్తక సంఘాల సహకారంతో సంకా బాలాజీగుప్తా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21.50 అడుగుల మహాకాల్ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. రూ.10 నుంచి రూ.500 నోట్లతో అద్భుతమైన పుష్పగుచ్ఛాలు, దండలు తయారు చేసి ఏకంగా రూ.2.41 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో గణనాథుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 18 ఏళ్ల క్రితం కేవలం రూ.5 లక్షలతో ప్రారంభమైన ఈ వినూత్న ధనగణపతి అలంకరణ సంప్రదాయం ప్రస్తుతం కోట్లకు చేరింది.