మరోసారి పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు సూర్య, జ్యోతిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: తమిళనాడు
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక తమ ఇరవై ఏళ్ల దాంపత్య జీవితాన్ని పురస్కరించుకుని మరోసారి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చర్చిలో ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఉంగరాలు మార్చుకుని కొత్త ప్రమాణాలు చేసుకున్న ఈ జంట ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సూర్య భావోద్వేగానికి గురికాగా, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.