బాలికల్లో ఆత్మవిశ్వాసమే రక్ష: అంపావల్లిలో ఘనంగా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బలిజిపేట

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం అంపావల్లి గ్రామంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి బ్రహ్మకుమారీస్ కేంద్రం ఇంచార్జి రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు. నేటి సమాజంలో బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. బాలికలు సంకల్ప బలంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో స్థానిక బాలికలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.