శ్రీకాకుళంలో రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న ఐదుగురు యువకులను రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. రూర్కెలా నుండి గుణుపూర్ వెళుతున్న రైలు ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.