వైరల్ జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విశాఖ: కేజీహెచ్లో కిక్కిరిసిన ఓపీ రోగులు

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

వాతావరణ మార్పుల కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వైరల్ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నట్లు కేజీహెచ్ అధికారులు తెలిపారు. రోజువారీగా ఆసుపత్రికి వచ్చే రోగులలో గణనీయంగా జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు పేర్కొన్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరతతో పాటు వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. అత్యవసర సేవల కోసం అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని విభాగాల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.