అమరావతిలో భారీ నిర్మాణాలకు సీఆర్డీఏ కీలక ఆమోదం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ సమావేశంలో కొన్ని అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ అసెంబ్లీ భవనానికి 250 మీటర్ల ఎత్తుతో స్పెర్ నిర్మాణానికి దాదాపు రూ.662 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు పరిపాలనాపరమైన ఆమోదం లభించింది. అలాగే భూసమీకరణ కింద రైతులకు కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,548 కోట్లతో టెండర్లు పిలవడానికి పాలనా అనుమతులు జారీ అయ్యాయి.