సిరికొండలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన: వేటకు దూరంగా ఉండాలని పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిరికొండ
జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ సిరికొండ గ్రామంలో వన్యప్రాణుల సంరక్షణ, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి కె. నర్సింగరావు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణతో అడవులు, పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. అక్రమ వేటకు దూరంగా ఉండాలని, అంతరించిపోతున్న అరుదైన పక్షులు, జంతువుల సంరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. మహాత్మా గాంధీ జయంతి స్ఫూర్తితో జీవవైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.