యూట్యూబర్ నందన అరెస్ట్: రూ.15 కోట్ల వీసా మోసం గుట్టు రట్టు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

యువతకు విదేశీ ఉద్యోగాల ఆశ చూపి రూ.15 కోట్లు టోకరా వేసిన ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ధృవపత్రాలు సృష్టించి నిరుద్యోగులను మోసగించిన ఈ ఘటనలో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో విమానాశ్రయంలో పట్టుబడ్డారు.