పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత: స్వచ్ఛతా అభియాన్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కేంద్రమంత్రి G Kishan Reddy స్పష్టం చేశారు. స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ఏక్ దిన్, ఏక్ సాత్, ఏక్ గంట స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఆయన కొనియాడారు. మెట్రో స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించారు.