ఆమనగల్లులో సీనియర్ నేత ఖలీల్ సేవలను ఘనంగా కొనియాడిన ఎమ్మెల్యే
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ సీనియర్ నాయకుడు ఖలీల్‌ను ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధికి సీనియర్ నేతలు చేస్తున్న సేవలను కొనియాడడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.