రెండేళ్లలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న బొత్స సత్యనారాయణ
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని జోష్ నింపాయి. బొత్స వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.