హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కోర్సులు ప్రారంభం

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా హైదరాబాద్‌లో డిసెంబర్ నుంచి ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు, నిపుణులకు అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందుబాటులోకి రానుంది.