యువతకు ఉపాధి లక్ష్యంగా నాలుగు వేల కోట్లతో ఐటీఐల ఆధునీకరణ: మంత్రి వివేక్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నాలుగు వేల కోట్ల రూపాయలతో అరవై ఐదు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, రానున్న కాలంలో విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.