రాబోయే మూడు నెలలు వరుస సినిమాలతో అలరిస్తాం: విజయ్ దేవరకొండ

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'ఎపిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడు నెలల్లో తన కుటుంబం, స్నేహితుల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అభిమానులు తిడుతున్నారనే భయంతోనే షూటింగ్ నుంచి హడావుడిగా విగ్గు కూడా తీయకుండా ఈవెంట్‌కు వచ్చానని సరదాగా నవ్వుతూ చెప్పారు. టాలీవుడ్‌లో రాబోయే చిత్రాలన్నీ వంద శాతం విజయం సాధిస్తాయన్నారు.