పొదలకూరులో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు పట్టణంలోని రాంనగర్ గేట్ సెంటర్లో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ గుత్తి వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివ రాకేష్ పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.