జగన్ సవాల్ నిరూపిస్తే జైలుకు వెళ్తా: దస్తగిరి

రిపోర్టర్: నరేష్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి దంపతులు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను సందర్శించారు. తమకు ప్రాణభయం ఉందని, పులివెందులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌పై సవాల్ విసురుతూ, తాను వకాలత్ తీసుకున్నట్లు నిరూపిస్తే జైలుకు వెళ్తానని, లేదంటే జగన్ రాజకీయాలు వదులుకుంటారా అని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో వాస్తవాలను సీఎం చంద్రబాబుకు వివరిస్తామని తెలిపారు.