తాండూరులో ఘనంగా క్విజ్ ఓరా పోటీలు, విజేతలకు బహుమతులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: వికారాబాద్

తాండూరులో టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ ఓరా పోటీల్లో నేతాజీ గురుకుల పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. గంగోత్రి విద్యాలయంలో జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు నీరజతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.