బెల్లంపల్లిలో అక్రమ పశువుల రవాణా.. 23 పశువుల స్వాధీనం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మండలం తాళ్ల గురుజాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం భారీగా అక్రమ పశువుల రవాణాను అడ్డుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు బొలెరో వాహనాల్లో ఎటువంటి అనుమతులు, రసీదులు లేకుండా తరలిస్తున్న 23 పశువులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై ఎస్సై రామకృష్ణ స్పందిస్తూ, నిందితులు షేక్ ఇర్ఫాన్, ఎస్.డి. ఫర్హాన్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులను సురక్షితంగా గోలేటి గోశాలకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.