కొత్తవలస రైల్వే స్టేషన్లో బీఎస్ఎఫ్ అధికారులతో సిబ్బంది దురుసు ప్రవర్తన

రిపోర్టర్: రమేష్ స్థలం: కొత్తవలస

కొత్తవలస రైల్వే స్టేషన్లో రైల్వే సిబ్బంది తమతో అనుచితంగా ప్రవర్తించారని బీఎస్ఎఫ్ అధికారులు ఫిర్యాదు పుస్తకంలో నమోదు చేశారు. కేరళ నుంచి అస్సాం వెళ్తున్న 151వ బెటాలియన్ బీఎస్ఎఫ్ సిబ్బంది కోసం కేటాయించిన ప్రత్యేక రైలు కొత్తవలసలో ఆగింది. నీటి సదుపాయం కల్పించకపోగా, విశ్రాంతి గది తాళం చెవి అడిగినప్పుడు ఉద్యోగి దురుసుగా ప్రవర్తించారని కమాండింగ్ అధికారులు పేర్కొంటూ, బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో గట్టిగా కోరారు.