పెద్ద వాల్గోట్ గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సిరికొండ

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాము, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొని గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ గ్రామస్తులు నివాళులు అర్పించారు.