ఐక్యరాజ్యసమితి వేదికగా ఎస్ జైశంకర్ కీలక దౌత్య భేటీలు

రిపోర్టర్: శివ స్థలం: New York

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 81వ వార్షిక సమావేశాల సందర్భంగా న్యూయార్క్ నగరంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఫ్రాన్స్, ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి దేశాల విదేశాంగ మంత్రులతో ఆయన సమావేశమై ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభం అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు.