శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారుల ఆహ్వానం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Srisailam
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. ఉండవల్లిలోని అధికారిక నివాసంలో వారిని ప్రత్యేకంగా కలిసిన అధికారులు, ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. పది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాలలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.