తుపాను నష్టపోతే బాధితులకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా

రిపోర్టర్: గోపి స్థలం: పశ్చిమగోదావరి

తుపాను వల్ల నష్టపోయిన చిట్టచివరి వ్యక్తికీ ప్రభుత్వ పరంగా తగిన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం నవరసపురంలో దెబ్బతిన్న వరి చేలు, కొబ్బరి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, పునరావాస కేంద్రాల బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు, సమస్యల పరిష్కారానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు.