వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా నుంచి నారాయణమ్మ ఫస్ట్ సింగిల్ అప్డేట్
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఏకే 47 చిత్రానికి సంబంధించి మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. ఈ చిత్రంలోని నారాయణమ్మ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నివేతా పేతురాజ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా అక్టోబర్ 2, 2026న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.