రాపూర్ ఘాట్లో చిరుతల సంచారం.. వాహనదారులకు అప్రమత్తత హెచ్చరిక

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని చిట్వేల్ - రాపూర్ ఘాట్లో మంగళవారం చిరుతలు కనిపించడంతో వాహనదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘాట్ మార్గంలో ద్విచక్ర వాహనాలపై ఒంటరిగా ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా సూచించారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప ఒంటరిగా ప్రయాణించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వారు హెచ్చరించారు.