వృత్తిపరమైన అంశాలపై నిరంతరం అధ్యయనం చేయాలని జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచన

రిపోర్టర్: గోపి స్థలం: గుంటూరు

న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు డిగ్రీ పట్టాలతో సరిపెట్టుకోకుండా వృత్తిపరమైన అంశాలపై నిరంతరం అధ్యయనం చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సూచించారు. శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన న్యాయవిభాగం పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. జ్ఞానాన్వేషణకు వయసుతో సంబంధం లేదని, తాను ఈ వయసులోనూ చదువుతూనే ఉన్నానని తెలిపారు. సంపాదన కంటే విలువలకు, నైతిక ప్రవర్తనకే ప్రాధాన్యమివ్వాలని ఆయన హితవు పలికారు.