స్థానిక ఎన్నికలు: కాకినాడ జిల్లా తునిలో ఉత్సాహంగా ఓటేసిన ట్రాన్స్జెండర్లు

రిపోర్టర్: గోపి స్థలం: తుని

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఏడో వార్డులో ట్రాన్స్జెండర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు స్థానిక నివాసితులు తెలిపారు. క్యూలైన్లలో నిలబడి స్వేచ్ఛగా ఓటేశామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైన ఆయుధమని వారు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.